Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌లో మరో అండర్ పాస్ నిర్మించండి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 06:32 PM

ఆర్.కే.ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..

21-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

యశోద ఆసుపత్రి నిపుణులచే 600 మందికి వైద్య పరీక్షలు..

నల్గొండ : నిరుపేదల ఆరోగ్యానికి భరోసా కల్పించడమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాలు దోహదపడతాయని బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణమరాజు, పిల్లి శివకృష్ణ రాజ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మలకపేట యశోద ఆసుపత్రి, ఆర్కేఎస్ (RKS) ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ప్రేరణ పాఠశాలలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని వారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్థానిక 10వ డివిజన్ కార్పొరేటర్ చొరవతో నిర్వహించిన ఈ శిబిరానికి పట్టణంలోని వివిధ డివిజన్ల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. యశోద ఆసుపత్రికి చెందిన గుండె నిపుణులు డాక్టర్ వీరారెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ షైనీ, జనరల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ గోపీనాథ్ రోగులకు పరీక్షలు నిర్వహించి సలహాలు అందించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుమారు 600 మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.శిబిరంలో ప్రధానంగా 2డీ ఎకో (2D Echo), ఈసీజీ, బీపీ, షుగర్, మధుమేహం, హిమోగ్లోబిన్ (Hb) పరీక్షలతో పాటు కంటి పరీక్షలు, స్త్రీలకు సంబంధించిన ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలను చేరువ చేయడమే తమ ఫౌండేషన్ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రేరణ స్కూల్ ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, బానోత్ రవి నాయక్, గంగరబోయిన వెంకన్న, ఐతరాజు జానయ్య, పుల్లెంల మహేష్, జ్యోతి, కృష్ణ, అశోక్ రెడ్డి, నామ ప్రకాష్, వెంకటాచారి పాల్గొన్నారు. అలాగే బీజేపీ ఇన్చార్జి కందుల శ్రీను, ఉమాదేవి, యశోద ఆసుపత్రి సీనియర్ ఎగ్జిక్యూటివ్ (పి.ఆర్.ఓ) అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్.కే.ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News