Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:09 PM

అప్పుల భారం గృహిణి ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతూ మృతి

03-03-2026 289 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అప్పుల ఒత్తిడి కుటుంబంలో విషాదానికి దారితీసిన ఘటన చిట్యాల మండలం పరిధిలోని సుంకేనపల్లి గ్రామంలో వెలుగుచూసింది. లారీ కొనుగోలు సమయంలో తీసుకున్న అప్పుల విషయమై భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర పరిణామాలకు దారితీసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బొజ్జ పావని (35) తన భర్త బొజ్జ శేఖర్‌తో కలిసి ఇటీవల లారీ కొనుగోలు చేశారు. ఆ సందర్భంగా తీసుకున్న అప్పుల భారంతో గత నెల 25వ తేదీ రాత్రి సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవతో మనస్తాపానికి గురైన పావని క్షణికావేశంలో ఇంటి పక్కనే ఉన్న టర్పెంటైన్ ఆయిల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.

తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మార్చి 3 ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.మృతురాలి తండ్రి పల్లెర్ల సాలయ్య (60), వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామం నివాసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

అప్పుల భారం గృహిణి ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతూ మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News