Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:05 AM

అమెరికాలో ముగ్గురు వరంగల్ వాసుల మృతి – గుండెపోటుతో విషాదం

19-03-2026 240 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అమెరికాలో స్థిరపడి కుటుంబంతో సంతోషంగా జీవించాలనే ఆశతో వెళ్లిన వరంగల్ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తుల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల వరుసగా గుండెపోటులతో వీరు కన్నుమూయడం ఆందోళన కలిగిస్తోంది.వరంగల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (41) ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు.అదే విధంగా హనుమకొండకు చెందిన మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుమార్తె శ్వేత (41) కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. అలాగే తన మనవడిని చూడటానికి అమెరికా వెళ్లిన చిదురాల విజయరాణి (55) అక్కడే అనారోగ్యానికి గురై మరణించారు.సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న తీవ్రమైన పని ఒత్తిడి, అనియంత్రిత జీవనశైలి, సమయాభావం వంటి కారణాలు గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగం, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకునే క్రమంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.ఈ ఘటనలు వరంగల్ ప్రాంత ప్రజల్లో తీవ్ర విషాదాన్ని రేపాయి. కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖంలో మునిగిపోయారు. విదేశాల్లో ఉన్నవారు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సంఘటనలు మళ్లీ గుర్తుచేస్తున్నాయి.

Sthanikam

అమెరికాలో ముగ్గురు వరంగల్ వాసుల మృతి – గుండెపోటుతో విషాదం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News