Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:05 AM

అగ్ని ప్రమాదం బాధితులకు ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు: ఎమ్మెల్యే

24-04-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కల్హేర్ మండల పరిధిలోని బీబీపేట్ గ్రామంలో నిన్న రాత్రి జరిగిన విద్యుత్ ప్రమాదంలో కాండ్రపల్లి సుశీల (భర్త సాయిలు) నివాసం షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమై, కుటుంబం సర్వం కోల్పోయి నిరాశ్రయంగా మారింది. విషయం తెలుసుకున్న శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మరియు అనుపమ రెడ్డి వెంటనే గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితుల పరిస్థితిని గమనించిన వారు తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు బియ్యం, పప్పులు వంటి నిత్యావసర సరుకులను అందజేసి ఆదుకున్నారు. అలాగే ప్రభుత్వం తరపున కూడా పూర్తి సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన పేద కుటుంబాలకు అండగా ఉండటం మన బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండు స్వప్న మోహన్ మాజీ జడ్పీటీసీ, సాయిలు గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

అగ్ని ప్రమాదం బాధితులకు ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు: ఎమ్మెల్యే

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కల్హేర్ మండల పరిధిలోని బీబీపేట్ గ్రామంలో నిన్న రాత్రి జరిగిన విద్యుత్ ప్రమాదంలో కాండ్రపల్లి సుశీల (భర్త సాయిలు) నివాసం షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమై, కుటుంబం సర్వం కోల్పోయి నిరాశ్రయంగా మారింది. విషయం తెలుసుకున్న శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మరియు అనుపమ రెడ్డి వెంటనే గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితుల పరిస్థితిని గమనించిన వారు తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు బియ్యం, పప్పులు వంటి నిత్యావసర సరుకులను అందజేసి ఆదుకున్నారు. అలాగే ప్రభుత్వం తరపున కూడా పూర్తి సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన పేద కుటుంబాలకు అండగా ఉండటం మన బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండు స్వప్న మోహన్ మాజీ జడ్పీటీసీ, సాయిలు గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News