Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:06 AM

అంగన్వాడీ సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలి: చిరంజీవి

14-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు అమలు చేయాలని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలను 18 వేల రూపాయలకు పెంచుతామని ప్రభుత్వాలు తమ ఎన్నికల హామీల్లో ప్రకటించాయని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ హామీలు అమలు కాలేదని అన్నారు.అంగన్వాడీ సిబ్బంది చిన్నారుల సంరక్షణ, పోషణ, విద్యా కార్యక్రమాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ వారికి సరైన వేతనాలు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే కనీస వేతనాలను పెంచడంతో పాటు అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన ఐసీడీఎస్ పథకానికి ప్రభుత్వం తగినంత బడ్జెట్‌ను కేటాయించాలని ఆయన అన్నారు. ప్రీ-ప్రైమరీ విద్యను అంగన్వాడీ టీచర్ల ద్వారానే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.మే నెలలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పూర్తి నెల సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిబ్బంది సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, సమస్యలను పరిష్కరించకపోతే మార్చి 16 నుండి ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశముందని హెచ్చరించారు.ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.

Sthanikam

అంగన్వాడీ సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలి: చిరంజీవి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News