Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:01 AM

అంగన్‌వాడీ సేవల బలోపేతానికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ – ఎమ్మెల్యే సంజీవరెడ్డి

24-04-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన “పోషణ పక్షం” కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కె లలిత కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం అందజేసిన స్మార్ట్ మొబైల్ ఫోన్లను ఆయన పంపిణీ చేశారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఆరోగ్యకరమైన తరం ఎదగాలంటే చిన్నారుల పోషణపై ప్రత్యేక దృష్టి అవసరమని, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచి సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రికార్డుల నిర్వహణను సులభతరం చేయడం ద్వారా సేవల నాణ్యత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, బాణాపురం రాజు, రుక్మిణి గోపాల్ రెడ్డి, షారుఖాన్, మహేష్ చౌహన్, సుబుర్, మైతాబ్, వివేకానంద, లక్ష్మణ్, కౌన్సిలర్లు, తాహెర్ అలీ, పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ, ఐసిడిఎస్ అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్‌వాడీ సేవల బలోపేతానికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ – ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన “పోషణ పక్షం” కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కె లలిత కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం అందజేసిన స్మార్ట్ మొబైల్ ఫోన్లను ఆయన పంపిణీ చేశారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఆరోగ్యకరమైన తరం ఎదగాలంటే చిన్నారుల పోషణపై ప్రత్యేక దృష్టి అవసరమని, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచి సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రికార్డుల నిర్వహణను సులభతరం చేయడం ద్వారా సేవల నాణ్యత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, బాణాపురం రాజు, రుక్మిణి గోపాల్ రెడ్డి, షారుఖాన్, మహేష్ చౌహన్, సుబుర్, మైతాబ్, వివేకానంద, లక్ష్మణ్, కౌన్సిలర్లు, తాహెర్ అలీ, పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ, ఐసిడిఎస్ అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News