Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 04:59 PM

ఆదివారం సందడి: బోరంచలో నల్లపోచమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు

ఆదివారం సందడి: బోరంచలో నల్లపోచమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు

ఆదివారం సందడి: బోరంచలో నల్లపోచమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు
March 22, 2026 06:16 PM 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో, మంజీర నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగేష్ స్వామి అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం నిర్వహించి, అనంతరం కుంకుమార్చన పూజలు చేశారు.పూజల అనంతరం అమ్మవారికి నుదుట పసుపు, కుంకుమ తిలకం దిద్ది, పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే వివిధ రకాల సుగంధ పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు.అనంతరం హారతి సమర్పించి, నైవేద్యం నివేదించారు. ఆలయం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగేష్ స్వామి మాట్లాడుతూ, ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చినట్లు తెలిపారు. జిల్లా నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు. భక్తులు పోచమ్మ తల్లికి ఒడిబియ్యం, కుంకుమార్చన వంటి పూజలు చేసి, తమ మొక్కులు తీర్చుకున్నారు. కొంతమంది భక్తులు బోనం ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, బోనాలు సమర్పిస్తూ ప్రత్యేక భక్తిని చాటుకున్నారు.భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది. ఈ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే శక్తిగల దేవతగా ఎంతో పేరు పొందిందని, జిల్లాలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయాలలో ఇదొకటిగా గుర్తింపు పొందిందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి, సిద్దు స్వామి, ప్రవీణ్ స్వామి, శ్రీకాంత్ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నార

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News