Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:13 AM

అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి కేంద్ర సహకారం కోరిన:జహీరాబాద్ ఎంపీ

26-02-2026 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఢిల్లీలోని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గాడ్కరి కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కూమార్ షేట్కార్ మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా నిజాంపేట్ – నారాయణఖేడ్ మార్గం మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు జాతీయ రహదారి 161 (బి) అభివృద్ధి పనులకు రూ. 520 కోట్లు మంజూరు చేసి పనులు కొనసాగుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రహదారి పూర్తయితే ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మెరుగుపడి వ్యాపార, వ్యవసాయ రంగాలకు మరింత ఊతం లభిస్తుందని వివరించారు.అలాగే కర్ణాటక సరిహద్దు నుండి బీదర్ వరకు మిగిలి ఉన్న ఎనిమిది కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసి, దానిని 161 (బి) రహదారితో అనుసంధానం చేయాలని కోరారు.ఈ అనుసంధానం వల్ల రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సులభమై ప్రజలకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.ఇక కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.పట్టణంలో మౌలిక వసతులు, రహదారులు,తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సదుపాయాల అభివృద్ధికి కేంద్ర సహాయం అవసరమని వివరించారు.ఈ అంశాలపై కేంద్ర మంత్రి నితిన్ గాడ్కరి సానుకూలంగా స్పందించి, ప్రతిపాదనలు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Sthanikam

అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి కేంద్ర సహకారం కోరిన:జహీరాబాద్ ఎంపీ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News