Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:03 AM

అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం – ఎమ్మెల్యే సంజీవరెడ్డి

21-04-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం తుమ్నూర్ గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ మహానుభావుడని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, అంటరానితనం నిర్మూలనకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే నేడు ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవం లభిస్తున్నాయని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, ముఖ్యంగా యువత విద్య ద్వారా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇది రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ గ్రామ సర్పంచ్, దత్తు బిరధర్ మానూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, మోహన్ రెడ్డి, హన్మయ్య, భారత్, శ్రీశైలం, వివిధ గ్రామాల సర్పంచులు, బ్రహ్మానంద్ రెడ్డి మాజీ సర్పంచ్, విగ్రహ దాత, స్థానిక ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ సంఘం సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.

Sthanikam

అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం – ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News