Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:08 AM

అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం – బోరంచలో ప్రతిజ్ఞ

14-04-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప హాజరై అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, గ్రామపంచాయతీ కార్యదర్శి సంతోష్,గ్రామ వార్డు సభ్యులు కలిసి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి మరియు గ్రామంలోని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు అమూల్యమని, సమానత్వం, న్యాయం, స్వాభిమానం అనే విలువలను ఆయన మనకు అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని సంకల్పం వ్యక్తం చేశారు.

Sthanikam

అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం – బోరంచలో ప్రతిజ్ఞ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News