Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:04 AM

8వ డివిజన్ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తాం

19-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ద్వారకానగర్‌లో రేణుక ఎల్లమ్మ, ముత్యాలమ్మ దేవాలయాలకు శంకుస్థాపన

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ ద్వారకానగర్ కాలనీలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి దేవాలయాల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మల కృపతో పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. 8వ డివిజన్ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

డివిజన్‌లో ఇందిరమ్మ ఇళ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, వృద్ధాప్య పింఛన్లు, సీసీ రోడ్లు, వీధి దీపాలు వంటి అభివృద్ధి పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మున్సిపాలిటీ నిధుల ద్వారా పూర్తి చేస్తామని తెలిపారు. పట్టణంలోని ఇతర వార్డులతో పోలిస్తే 8వ డివిజన్ వెనుకబడి ఉందని, ఇక్కడ మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అనంతరం తన్నీరు స్వాతి భూషణం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి వారు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ వజ్జ సంతోషిని రమేష్ యాదవ్, నల్గొండ లిఫ్ట్ సంఘం అధ్యక్షుడు వేముల లక్ష్మయ్య, 7వ డివిజన్ అధ్యక్షుడు స్వామి గౌడ్, 10వ డివిజన్ అధ్యక్షుడు చిన్నాల జానయ్య, మాజీ ఉపసర్పంచ్ జడల లింగయ్య, ఎండి జావిద్, పిల్లి రమేష్, వేముల నాగరాజు, కన్నెబోయిన వెంకన్న, మీనయ్య, తమ్మిశెట్టి జానయ్య తదితరులతో పాటు కాలనీవాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

8వ డివిజన్ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News