Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:07 AM

12వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం – రెండు బోరుబావులు ఏర్పాటు

17-04-2026 326 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు మున్సిపల్ జనరల్ ఫండ్‌తో రెండు కొత్త బోరుబావులను ఏర్పాటు చేయించారు. రానున్న ఎండాకాలంలో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యగా ఈ పనులు చేపట్టగా, శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది పెద్ద ఉపశమనంగా మారింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు పాల్గొని భూమిపూజ చేసి బోరుమోటార్లను ప్రారంభించారు. అలాగే మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్, గణేష్, వార్డు ప్రజలు, యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

12వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం – రెండు బోరుబావులు ఏర్పాటు

Article Image

సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు మున్సిపల్ జనరల్ ఫండ్‌తో రెండు కొత్త బోరుబావులను ఏర్పాటు చేయించారు. రానున్న ఎండాకాలంలో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యగా ఈ పనులు చేపట్టగా, శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది పెద్ద ఉపశమనంగా మారింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు పాల్గొని భూమిపూజ చేసి బోరుమోటార్లను ప్రారంభించారు. అలాగే మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్, గణేష్, వార్డు ప్రజలు, యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News