Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:37 AM

యువతలో ఆధ్యాత్మికత పెంపొందించాలి: పాస్టర్ కిరణ్ పాల్

19-03-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ టీఎన్జీవో భవనంలో సియాన్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ యూత్ రిట్రీట్

నల్గొండ పట్టణ కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో సియాన్ యూత్ ఆధ్వర్యంలో ఒకరోజు క్రిస్టియన్ యూత్ రిట్రీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌గా హాజరైన పాస్టర్ కిరణ్ పాల్ యువతకు ఆధ్యాత్మికతపై ప్రేరణాత్మక సందేశం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని, క్రైస్తవ మార్గం శాంతి, ప్రేమ, సౌబ్రాతృత్వానికి ప్రతీక అని తెలిపారు. ప్రపంచ శాంతి స్థాపనలో క్రైస్తవులు ముందుండాలని, దేశ అభ్యున్నతికి విద్యతో పాటు ప్రేమను పంచాలని యువతను కోరారు.

సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. తన దైవ సందేశంతో పాల్గొన్న వారిని ఆకట్టుకున్న పాస్టర్ కిరణ్ పాల్ ప్రసంగం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమం ఆరాధన గీతాలు, ప్రార్థనలతో ఉత్సాహభరితంగా కొనసాగింది. అనంతరం సియాన్ యూత్ సభ్యులు పాస్టర్ కిరణ్ పాల్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సియాన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, వడ్డే జాకబ్ రోషన్, టి. ప్రవీణ్ కుమార్, జర్నలిస్టు ప్రేమ్ కుమార్, సాగర్ జాన్, సుమన్ రమన్, అఖిల్, నోయెల్, శ్రీకాంత్, సల్మాన్ రాజ్, స్టీఫెన్ పాల్, సంపత్, గోపి, జాన్, జయరాజ్, జైసన్, పాస్టర్ జీవన్, మోసెస్, సియాన్ వుమెన్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువతలో ఆధ్యాత్మికత పెంపొందించాలి: పాస్టర్ కిరణ్ పాల్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News