Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సౌత్‌-ఈస్ట్‌ ఏషియన్‌ కప్‌కు తెలంగాణ నుంచి ముగ్గురు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 11:04 AM

యువతకు క్రీడలతో ఆత్మవిశ్వాసం – చిట్యాలలో సంసద్ ఖేల్ మహోత్సవ్

23-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో క్రీడా మహోత్సవాలు కీలకం అని భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు

చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్:

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం, నకిరేకల్ నియోజకవర్గ స్థాయి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సంసద్ ఖేల్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చిట్యాల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను బీజేవైఎం రాష్ట్ర నాయకులు, గేమ్స్ ఇన్‌చార్జి కంబాలపల్లి సతీష్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీదేవి రెడ్డి, నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి నకిరేకంటి మొగులయ్య హాజరై క్రీడలను ప్రారంభించారు.అనంతరం జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘అమృత్ పీఢి’కి ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను అందించడంలో ఇలాంటి క్రీడా మహోత్సవాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసే ఈ కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. యువకులు క్రీడలతో పాటు విద్యలోనూ రాణించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరెళ్ల శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు కన్నెబోయన మహాలింగం, జోగు శేఖర్, గేమ్స్ కో-ఇన్‌చార్జి కన్నెబోయన మురళి, సీలేవేరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువతకు క్రీడలతో ఆత్మవిశ్వాసం – చిట్యాలలో సంసద్ ఖేల్ మహోత్సవ్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News