Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:58 PM

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి: అదనపు ఎస్పీ చైతన్య

29-04-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా “బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ” వారోత్సవాలు ఏప్రిల్ 29 నుంచి మే 2 వరకు నిర్వహిస్తున్న సందర్భంగా యం.ఎన్.ఆర్ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు టీనేజ్ ప్రెగ్నెన్సీ, ఇంటి నుంచి పారిపోవడం వల్ల కలిగే ప్రమాదాలు, సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా పిల్లలు, యువత సైబర్ నేరాలు, డ్రగ్స్ వంటి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదనపు ఎస్పీ కుమారి చైతన్య మాట్లాడుతూ పోక్సో చట్టం, టీనేజ్ ప్రెగ్నెన్సీ దుష్పరిణామాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై వివరించి యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ విద్యార్థులందరూ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని కష్టపడి చదివి ముందుకు సాగాలని, సమస్యలు వచ్చినప్పుడు నిరాశకు లోనుకాకుండా పెద్దల సహాయం తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి నిర్ణయాలకు పాల్పడవద్దని తెలిపారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని, సమస్యలు ఉంటే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ లేదా 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ సభ్యుడు వెంకటేశం, డీసీపీఓ రత్నం, డీఎస్పీ సత్తయ్య, డా. నాగనిర్మల, సీఐ నాగేశ్వరరావు, డీసీపీయూ సిబ్బంది, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి: అదనపు ఎస్పీ చైతన్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News