Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:50 AM

యోగాతో విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెంపొందుతుంది

26-04-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యార్థినీ విద్యార్థులు యోగా నేర్చుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెంపొందుతుందని సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణా కేంద్రం యోగ గురువు చాడ పాపిరెడ్డి, శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం తెలిపారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థుల కోసం మే 10 వరకు నిర్వహించనున్న ఉచిత యోగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా అవసరమని, ముఖ్యంగా బాల్య దశలో యోగా అలవాటు చేసుకుంటే జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు చదువుల్లో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఈ శిక్షణ తరగతులు 15 రోజులపాటు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు మే 10న సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ యోగా తరగతులకు పంపించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, కుంచపర్తి రాజశేఖర్, వందనపు వెంకటేశ్వర్లు, బ్రాహ్మణ కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి కట్టెకోల పూర్ణచంద్రరావు, యోగా ట్రైనర్ సుదర్శన్ రెడ్డి, యోగ సాధకులు శ్రీదేవి, దివ్య, సంధ్య, విజయలక్ష్మి, నాగరాజు, లింగయ్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యోగాతో విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెంపొందుతుంది

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News