Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:54 AM

యశోద ఆసుపత్రిలో నకిలీ వైద్యురాలి మోసం

యశోద ఆసుపత్రిలో నకిలీ వైద్యురాలి మోసం

యశోద ఆసుపత్రిలో నకిలీ వైద్యురాలి మోసం
12-03-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మత్తు ఇచ్చి పది తులాల బంగారం అపహరణ

సికింద్రాబాద్, మార్చి 12: సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో నకిలీ వైద్యురాలు మోసం చేసిన ఘటన కలకలం రేపింది. చికిత్స పేరుతో రోగికి మత్తు ఇచ్చి పది తులాల బంగారం తీసుకుని పరారైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.ఓల్డ్ బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన సుధారాణి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. చికిత్స అనంతరం విడుదలకు సిద్ధం చేస్తున్న సమయంలో వైద్యురాలిలా తెల్ల అప్రాన్ ధరించిన ఓ మహిళ గదిలోకి వెళ్లింది. రోగికి పరీక్షలు చేయాల్సి ఉందని చెప్పి కుటుంబ సభ్యులను బయటకు పంపించింది.కొంతసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లి చూడగా సుధారాణి స్పృహ కోల్పోయి ఉన్నట్లు గమనించారు. ఆమె ధరించిన పది తులాల బంగారం కనిపించకపోవడంతో వారు వెంటనే ఆసుపత్రి యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు.

అయితే ఆ మహిళ ఎవరో తమకు తెలియదని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అనంతరం మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సీసీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు అప్రాన్ ధరించిన మహిళ నర్సింగ్ సిబ్బంది గదికి వెళ్లినట్లు గుర్తించారు. ఆమె ఆసుపత్రి సిబ్బందికి పరిచయమున్న వ్యక్తేనా లేదా బయట నుంచి వచ్చినదా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితురాలిని గుర్తించే ప్రయత్నాలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Sthanikam

యశోద ఆసుపత్రిలో నకిలీ వైద్యురాలి మోసం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News