Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:49 AM

యాదవ విద్యార్థుల వసతి గృహానికి సహకారం కోరుతూ సమావేశం

19-04-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ రాష్ట్రంలో యాదవ విద్యార్థుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేయనున్న వసతి గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం సమీకరించే లక్ష్యంతో విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి

చదువుకుంటున్న యాదవ విద్యార్థులు సరైన వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి భవిష్యత్తు అభివృద్ధి కోసం వసతి గృహాల నిర్మాణం అత్యవసరమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఇటీవల నిర్వహించిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించిన చలకాని వెంకట్ యాదవ్‌ను విద్యావంతుల వేదిక మరియు యాదవ మేధావుల తరఫున ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక కన్వినర్ ముక్కాల వెంకన్న, వర్రే వెంకటేశ్వర్లు యాదవ్, ఉస్మానియా వీసీ రవీందర్ యాదవ్, చింతల రవీంద్రనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా వేదిక సభ్యులు కూడా హాజరయ్యారు.

Sthanikam

యాదవ విద్యార్థుల వసతి గృహానికి సహకారం కోరుతూ సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News