Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:17 PM

యాదగిరిగుట్ట రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి: కురునెళ్లి వెంకట్

27-05-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: వికలాంగుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కురునెళ్లి వెంకట్ ఆరోపించారు. భువనగిరి సుందరయ్య భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, ఐక్యరాజ్యసమితి హక్కుల ఒప్పందం, నేషనల్ పాలసీ, నేషనల్ ట్రస్ట్, మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్‌ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వికలాంగుల పెన్షన్ పెంపుపై ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు నిర్మించడంతో పాటు వికలాంగులపై వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు.

మహిళా వికలాంగులకు రక్షణ కల్పించాలని, స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. వికలాంగులకు సహాయ పరికరాలు పంపిణీ చేయడంతో పాటు ప్రత్యేక విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మే 29 నుంచి 31 వరకు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో వికలాంగుల చట్టాలపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని, దాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సురూపంగ ప్రకాష్, కార్యదర్శి వనం ఉపేందర్, కోశాధికారి లలిత, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, పాండాల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యాదగిరిగుట్ట రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి: కురునెళ్లి వెంకట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News