Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:35 AM

వృద్ధుల కోసం ప్రభుత్వ చర్యలకు మద్దతు.

వృద్ధుల కోసం ప్రభుత్వ చర్యలకు మద్దతు.

వృద్ధుల కోసం ప్రభుత్వ చర్యలకు మద్దతు.
25-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా అన్నారు.

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే సంతానం ఉన్న సందర్భాల్లో ఉద్యోగుల జీతాల నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే విధంగా బిల్లు తీసుకురావడం మంచి చర్యగా పేర్కొన్నారు. ఇది వృద్ధుల భద్రతకు తోడ్పడటమే కాకుండా కుటుంబ బాధ్యతలను గుర్తు చేస్తుందని అన్నారు.

అయితే వాస్తవ పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలపై ఫిర్యాదు చేయరని, కుటుంబ పరువు, సంబంధాల కారణంగా మౌనంగా బాధను భరిస్తారని తెలిపారు.

కాబట్టి ఫిర్యాదు లేకపోయినా సంతానం జీతాల నుంచి నేరుగా తల్లిదండ్రులకు సహాయం అందేలా ప్రభుత్వం ఆలోచించాలన్నారు. అది సాధ్యం కాకపోతే ప్రతి వృద్ధునికి షరతుల్లేకుండా ఆసరా పెన్షన్ అందించాలని సూచించారు.

ఇలాంటి చర్యలతో కుటుంబాల్లో వివాదాలు తగ్గి, బంధాలలో గౌరవం, ప్రేమ పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Sthanikam

వృద్ధుల కోసం ప్రభుత్వ చర్యలకు మద్దతు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News