Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

వివేకానంద ఆశయాలు యువతకు మార్గదర్శకం : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Updated : 12 Jan 2026 14:36 IST
As Preferred Source 1 min read
వివేకానంద ఆశయాలు యువతకు మార్గదర్శకం : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:శంకరంపేట్ మండల కేంద్రంలో ఈరోజు ఘనంగా నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తిదాయకమైన మహానుభావుడని, ఆయన బోధనలు నేటి సమాజానికి ఎంతో ప్రాసంగికమని అన్నారు.భారత యువతను జాగృతం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని, ఆయన ఆలోచనలు, ఆదర్శాలు ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ప్రత్యేకంగా యువత స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడిచి, విద్య, క్రమశిక్షణ, దేశభక్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, బలమైన భారతదేశ నిర్మాణానికి ఆయన ఆశయాలు మార్గదర్శకమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ ముఖ్య నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, నూతన సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగి స్వామి వివేకానంద జయంతిని ఘనంగా జరుపుకున్నారు.

Sthanikam

వివేకానంద ఆశయాలు యువతకు మార్గదర్శకం : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news