Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:07 AM

విపత్తుల నిర్వహణలో ప్రతి శాఖ కీలక పాత్ర పోషించాలి

07-05-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో పరిశ్రమల ప్రమాదాలు, వరదలు, అటవీ అగ్నిప్రమాదాలు వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి మాక్ విన్యాసాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విపత్తులు సంభవించిన సమయంలో అధికారులు సమన్వయంతో వేగంగా స్పందించి ప్రజలకు తక్షణ సహాయం అందించేలా అన్ని శాఖలు ముందుగానే సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా మాక్ విన్యాసాలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి శాఖ తమ బాధ్యతలను స్పష్టంగా తెలుసుకుని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు.జిల్లాలో పరిశ్రమల ప్రాంతాలు అధికంగా ఉన్నందున ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రమాదాల సమయంలో పాటించాల్సిన విధానాలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రజలకు తక్షణ సహాయం, పునరావాసం, పునరుద్ధరణ చర్యలు అందించేందుకు అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలని పేర్కొన్నారు. భద్రతా చర్యలను కచ్చితంగా అమలు చేసి ప్రమాదాలను ముందుగానే నివారించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అగ్నిమాపక శాఖ, పరిశ్రమల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్ శాఖ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

విపత్తుల నిర్వహణలో ప్రతి శాఖ కీలక పాత్ర పోషించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News