Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:39 AM

వినియోగదారుల హక్కులపై చైతన్యం పెంపు.జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

18-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రపంచ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంపై వచ్చిన వార్తల ప్రభావంతో వినియోగదారుల హక్కులపై అవగాహన మరింత పెరిగింది.

జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులు, సరైన పరిమాణం, ధర వివరాలు తెలుసుకోవడం ప్రతి వినియోగదారుడి హక్కు అని తెలిపారు. వినియోగదారుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, కల్తీ వస్తువులను అరికట్టేందుకు చట్టాలపై ప్రజల్లో అవగాహన అవసరమన్నారు.

“సురక్షితమైన ఉత్పత్తులు – నమ్మకమైన వినియోగదారులు” అనే అంశంపై జరిగిన చర్చలో నాణ్యమైన సేవలు పొందడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు. విద్యావంతులకే కాక సామాన్యులకు కూడా న్యాయం జరిగితేనే ఈ దినోత్సవానికి సార్ధకత ఉంటుందని పేర్కొన్నారు.

జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

ఉచిత న్యాయ సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రోజారాణి, హరికృష్ణ, బాలకృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు, వినియోగదారుల ఫోరం సభ్యులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

వినియోగదారుల హక్కులపై చైతన్యం పెంపు.జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News