Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:37 AM

వికలాంగ మహిళలకు ధైర్యమే దారి – చదువుతోనే సమాన హక్కులు

28-03-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

మహిళా వికలాంగులు సమాజంలో ఎదుర్కొంటున్న అసమానతలను ధైర్యంగా ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నిపుణులు పిలుపునిచ్చారు. చదువే వారికి గుర్తింపు, గౌరవం తీసుకువస్తుందని పేర్కొన్నారు.

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా వికలాంగుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 10 మంది మహిళా వికలాంగులకు ‘స్ఫూర్తి అవార్డులు’ ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్ఐసీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ… వికలాంగులపై ఉన్న వివక్షతను అధిగమించాలంటే విద్య ఒక్కటే మార్గమన్నారు. విద్య ద్వారా సామాజిక గౌరవం పెరుగుతుందని, వారి ప్రతిభను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. భీమా సేవలు ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తాయని తెలిపారు.

ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.జ్యోతి మాట్లాడుతూ… మహిళా వికలాంగులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, వివక్షను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ పథకాల అమల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య మాట్లాడుతూ… వికలాంగుల హక్కుల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. పెన్షన్ల పెంపు, కొత్త పింఛన్ల మంజూరు వెంటనే చేపట్టాలని కోరారు.

ప్రముఖ వైద్యురాలు డాక్టర్ నళిని మాట్లాడుతూ… మహిళా వికలాంగుల్లో ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సరైన జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగ మహిళలకు ధైర్యమే దారి – చదువుతోనే సమాన హక్కులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News