Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:02 AM

విఘ్నేశ్వర ఆలయ అభివృద్ధికి మున్సిపల్ చైర్మన్, ఉప చైర్మన్ సానుకూల స్పందన

23-03-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డులో వెలసిన శ్రీ విఘ్నేశ్వర ఆలయాన్ని సోమవారం మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ఉప చైర్మన్ తన్నీరు మల్లికార్జున గౌడ్, కౌన్సిలర్లు సందర్శించారు.మొదటి వార్డు కౌన్సిలర్ మొదల సైదులు-కామేశ్వరి, ఆలయ కమిటీ సభ్యులు, వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు వారు ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చైర్మన్, ఉప చైర్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆలయానికి సంబంధించిన పలు సమస్యలను, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధుల అంశాన్ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ గారు ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం అవసరమైన నిధులు మంజూరు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, వార్డు ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Sthanikam

విఘ్నేశ్వర ఆలయ అభివృద్ధికి మున్సిపల్ చైర్మన్, ఉప చైర్మన్ సానుకూల స్పందన

Article Image

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డులో వెలసిన శ్రీ విఘ్నేశ్వర ఆలయాన్ని సోమవారం మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ఉప చైర్మన్ తన్నీరు మల్లికార్జున గౌడ్, కౌన్సిలర్లు సందర్శించారు.మొదటి వార్డు కౌన్సిలర్ మొదల సైదులు-కామేశ్వరి, ఆలయ కమిటీ సభ్యులు, వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు వారు ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చైర్మన్, ఉప చైర్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆలయానికి సంబంధించిన పలు సమస్యలను, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధుల అంశాన్ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ గారు ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం అవసరమైన నిధులు మంజూరు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, వార్డు ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News