Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

విధి నిర్వహణలో వీరమరణం – కానిస్టేబుల్ సౌమ్య ధైర్యానికి సీపీ సజ్జనార్ నివాళి

01-02-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో దుండగులు ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్యను కారుతో ఢీకొట్టి పారిపోయారు.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సౌమ్య శనివారం రాత్రి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. జనవరి 23న ఈ ఘటన చోటు చేసుకోగా, దాదాపు తొమ్మిది రోజులు మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు నశించారు.తన విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టిన సౌమ్య మృతి పట్ల నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మత్తు రక్కసిని అడ్డుకునేందుకు ఆమె చూపిన ధైర్యం అప్రతిహతమని, రక్తమోడుతూ కూడా వెనకడుగు వేయకుండా పోరాడిన త్యాగం అపారమని సజ్జనార్ తెలిపారు. గంజాయి మాఫియా వాహనంతో హింసాత్మకంగా చంపడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి, సమాజ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరుడి ధైర్యానికి గౌరవం పలికారు.సజ్జనార్ ఈ ఘటన కేవలం ఒక విషాదం మాత్రమే కాకుండా, గంజాయి మాఫియా సమాజంలో ఎంత పెద్ద సమస్య అనేది గుర్తు చేసే ఉదాహరణ అని పేర్కొన్నారు. సౌమ్య మరణం మత్తు ద్రవ్యాల కుంభకోణం వల్ల సమాజానికి కలిగే ప్రమాదాన్ని హెచ్చరిస్తుందని ఆయన తెలిపారు. విధి నిర్వహణలో అమరుడైన సౌమ్య కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, మత్తు వ్యతిరేక పోరాటం ఆగిపోదని స్పష్టం చేశారు.

Sthanikam

విధి నిర్వహణలో వీరమరణం – కానిస్టేబుల్ సౌమ్య ధైర్యానికి సీపీ సజ్జనార్ నివాళి

Article Image

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News