Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:58 PM

విదేశీయులు తమ దేశాలకు వెళ్లే వరకు భద్రతతో చూసుకోవాలి : ఎస్పీ

28-04-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. విదేశీయులు తమ దేశాలకు తిరిగి వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతతో ఉంచాలని ట్రాన్సిట్ హోం అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పాస్‌పోర్ట్ గడువు ముగియడం మరియు ఇతర చట్టపరమైన కారణాలతో ట్రాన్సిట్ హోంలో ఉంచబడిన విదేశీయులను సంబంధిత ప్రక్రియ పూర్తయ్యే వరకు సురక్షితంగా సంరక్షిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ట్రాన్సిట్ హోంలో 12 మంది విదేశీయులు ఉన్నారని, వారి భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. విదేశీయులకు తగిన వసతి, ఆహారం, త్రాగునీరు, వైద్యసేవలు వంటి అవసరమైన సదుపాయాలు కల్పించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే ట్రాన్సిట్ హోంలో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తూ నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోగిపేట సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ పాండు, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విదేశీయులు తమ దేశాలకు వెళ్లే వరకు భద్రతతో చూసుకోవాలి : ఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News