Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:15 PM

వీరేశలింగం సేవలు ఆదర్శనీయం. వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

27-05-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,: సంఘ సంస్కర్త, గద్య తిక్కన కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి సందర్భంగా పలువురు విద్యావేత్తలు హైదరాబాద్‌లోని ఆయన గృహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు.. వీరేశలింగం పంతులు స్త్రీ విద్యాభివృద్ధి, వితంతు వివాహాల ప్రోత్సాహం, బాల్య వివాహాల నిర్మూలన కోసం విశేష కృషి చేశారని కొనియాడారు. హితకారిణీ సమాజం, వివేకవర్ధిని పత్రిక ద్వారా తెలుగు సమాజంలో చైతన్యం నింపారని పేర్కొన్నారు.

తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, నవ్యాంధ్రకు ఆధునిక భావాలను పరిచయం చేసిన మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోయారని అభివర్ణించారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సంస్కరణల దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అనంతరం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంఘం సభ్యులు, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ రవికుమార్ చేగొని, డాక్టర్ పి. విజయ్‌కుమార్, డాక్టర్ యాకూబ్ మాతంగి, డాక్టర్ పి. నాగరాజు, డాక్టర్ సిహెచ్. మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వీరేశలింగం సేవలు ఆదర్శనీయం. వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News