Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:58 AM

వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా

వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా

వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా
26-02-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సుప్రీం న్యాయస్థానం వరకూ వెళ్లి పోరాడతాం

మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇల్లు కట్టిస్తాం – కేటీఆర్ హామీ

ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో జరిగిన అక్రమ కూల్చివేతలతో ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. బాధితులను పరామర్శించిన ఆయన వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బాధితుల కోసం అవసరమైతే సుప్రీం న్యాయస్థానం వరకూ వెళ్లి పోరాడతామని స్పష్టం చేశారు. ప్రజలకు అన్యాయం జరిగితే బీఆరెస్ నిశ్శబ్దంగా ఉండదని, చట్టపరంగా, ప్రజాస్వామ్యపరంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే స్థలంలో మీకు ఇల్లు కట్టించి గృహప్రవేశాలు చేసే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. ఒక్క కుటుంబం కూడా రోడ్డున పడకుండా చూసుకుంటామని అన్నారు. అక్రమ కూల్చివేతల అంశాన్ని శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు తమకు అండగా నిలిచినందుకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News