Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:04 PM

వెలుగు పల్లిలో 15 కోట్లతో గోదాముల నిర్మాణ పనులను చేపట్టిన; తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.

09-04-2026 230 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామం శివారులో రుద్రమ్మ చెరువు వద్ద 15కోట్ల నూతన గిడ్డంగులు ఏర్పాటు కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేల్ , ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...గ్రామాల్లోని రైతుల ప్రయోజనాల కోసమే గోదాముల నిర్మాణం ప్రభుత్వం చేపట్టినట్లు వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సహకారంతో అడ్డగూడూరు కేంద్రంలో నూతనంగా పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

నియోజకవర్గానికి అదనంగా 2000 నూతన ఇందిరమ్మ ఇండ్లు ఉచిత మహాలక్ష్మి పథకం 500 కే గ్యాస్ కనెక్షన్ సన్న బియ్యం పంపిణీ పేద ప్రజల గుండెల్లో అభివృద్ధి పథకాలు నిలిచిపోయాయని అన్నారు. మద్దిరాల, నూతనకల్ మండలాల నడుమ నూతనంగా జూనియర్ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. వెలుగు పల్లి గ్రామానికి సుమారు గడిచిన రెండు సంవత్సరాల కాలంలో కోటి రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్టు తెలిపారు.

అనంతరం ఎఐసిసి సభ్యులు , యువనేత రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.... కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వంలో భాగంగా గ్రామానికి నూతన గిడ్డంగుల నిర్మాణం రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. దీనితో రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నట్లు తెలిపారు. ఎక్కడ అభివృద్ధి అవకాశం ఉన్న తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు, రానున్న ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య ,రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి ,వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు యోగానంద చారి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, వెలుగుపల్లి సర్పంచ్, నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షుడు కొరికొప్పుల నరేష్ గౌడ్, జిల్లా నాయకులు రేగటి రవి, కొండరాజు, మాచర్ల అనిల్ ,నాగరాజు, దాసు, తాసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేష్ కుమార్, నాయకులు , తదితరులుపాల్గొన్నారు.

Sthanikam

వెలుగు పల్లిలో 15 కోట్లతో గోదాముల నిర్మాణ పనులను చేపట్టిన; తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News