Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:14 AM

వీధి కుక్కల నియంత్రణపై కట్టుదిట్ట చర్యలు: కలెక్టర్ ఆదేశాలు

వీధి కుక్కల నియంత్రణపై కట్టుదిట్ట చర్యలు: కలెక్టర్ ఆదేశాలు

వీధి కుక్కల నియంత్రణపై కట్టుదిట్ట చర్యలు: కలెక్టర్ ఆదేశాలు
March 28, 2026 08:29 PM 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వీధి కుక్కల దాడులను నివారించి ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు అధికారులు సమన్వయంతో కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీ అక్షాంశ్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వీధి కుక్కల బెడద అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రభావిత ప్రాంతాల్లో కుక్కలను బంధించడం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రేబిస్ వ్యాధి నివారణకు వీధి కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేయడం తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు.

కుక్కల జనాభా నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో స్టెరిలైజేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రులు, ఆర్టీసీ బస్టాండ్‌ల వంటి రద్దీ ప్రదేశాల్లో ఉన్న కుక్కలను తక్షణం నియంత్రించాలని పేర్కొన్నారు. స్టెరిలైజేషన్ అనంతరం కుక్కలను తగిన షెల్టర్లలో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జాతీయ రహదారులపై వీధి కుక్కలు మరియు ఇతర జంతువుల సంచారం వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అలాగే మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో చెత్త నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ అత్యవసరమని పేర్కొన్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై తిరిగే జంతువులను గుర్తించి ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్ అండ్ బి శాఖ అధికారి సరిత, పశుసంవర్ధక శాఖ అధికారి జానయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా వైద్యశాఖ అధికారి మనోహర్, జిల్లా రవాణా శాఖ అధికారి సాయి కృష్ణ, మున్సిపల్ కమిషనర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News