Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:36 AM

వ్యవసాయాన్ని కాపాడండి.. దేశాన్ని రక్షించండి: ఏఐకేఎంఎస్ పిలుపు

26-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మంలో జరిగిన అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) కేంద్ర కార్యనిర్వాహక వర్గ సమావేశంలో రైతాంగ సమస్యలపై విస్తృతంగా చర్చించారు. “వ్యవసాయాన్ని కాపాడండి.. దేశాన్ని రక్షించండి” అనే నినాదంతో ఉద్యమాలకు సిద్ధం కావాలని జాతీయ నాయకులు పిలుపునిచ్చారు.

సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య, ప్రధాన కార్యదర్శి ఆశిష్ మిట్టల్, జాతీయ నాయకుడు రబీందర్ సింగ్ పాటియాలా పాల్గొన్నారు. సెప్టెంబర్‌లో ఖమ్మంలో జరగనున్న జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని బలహీనపరిచే విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. కొత్త విద్యుత్ బిల్లు, విత్తన బిల్లు, ఉపాధి హామీ పథకాల మార్పులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానాలు ఆమోదించారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అమలు, రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.

కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల రైతులకు నష్టం జరుగుతోందని, దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలను విస్తరించనున్నట్లు తెలిపారు. భూసేకరణ, భూదాన్ భూముల సమస్యలపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

రాబోయే రోజుల్లో రైతు, కూలీ వర్గాల హక్కుల కోసం అఖిల భారత స్థాయిలో పోరాటాలను మరింత బలోపేతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.

Sthanikam

వ్యవసాయాన్ని కాపాడండి.. దేశాన్ని రక్షించండి: ఏఐకేఎంఎస్ పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News