Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

వ్యవసాయ కార్మికులకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలి;తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

05-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

నాగారం : వ్యవసాయ కార్మికులకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిమట్టి పెళ్లి సైదులు ఆరోపించారు. ఆదివారం నాగారం మండల పరిధిలోని మండల కేంద్రంలోని ఈటూరు గ్రామంలో జరిగినతెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభకుఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రెక్కల కష్టం నమ్ముకుని జీవిస్తున్న వ్యవసాయ కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని జబ్బు చేస్తే వైద్యం, వ్యవసాయ కార్మికుల పిల్లలు చదువుకోవడానికి విద్య అందుబాటులో లేదన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి విబి జీవంజి పేరుతో కొత్త బిల్లును తీసుకొచ్చిందన్నారు. పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉపాధి హామీకి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలను రెండు పూటలు ఫోటో తీయాలని ఆలోచనను విరమించుకోవాలన్నారు.మార్చి నుండిఆగస్టు వరకు ఉపాధి కూలీలకు సమ్మర్ అలవెన్స్ వర్తింప చేయాలన్నారు. ఉపాధి కూలీలను ఆదుకునేందుకుప్రభుత్వం 200 రోజులు పని కల్పించి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వంసవరించినవ్యవసాయ కార్మికుల వేతనాలను అమలుచేసి గ్రామ సభలు నిర్వహించి పెరిగిన కూలి రేట్లను గ్రామాలలో ప్రచారం చేయాలని కోరారు. 50 సంవత్సరాలు నిండినవ్యవసాయ కార్మికులకు 7500 రూపాయలు పింఛన్ ఇవ్వాలన్నారు. వేసవి కాలం సమీపిస్తున్నందున గ్రామాలలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పని ప్రదేశంలో కనీస సౌకర్యాలైన త్రాగునీరు, మెడికల్ కిట్టు, టెంటు, పారా, గడ్డపార వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. అంతకుముందు గత మూడు సంవత్సరాలుగా నాగారం మండలంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం కార్యకలాపాల నివేదికను మండల కార్యదర్శి కడెం కుమార్ ప్రవేశపెట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు దేవరకొండ యాదగిరి, గట్టు కాల్వ ఎల్లమ్మ అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ఈ మహాసభలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం, సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కడెం కుమార్, సిఐటియు మండల కన్వీనర్ గుడిపూడి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు శిగ శీను, చెన్నబోయిన వీరయ్య, నాగారం మండల నాయకులు కండె బిక్షం, తంగేళ్ల వెంకన్న పాల్గొన్నారు.

Sthanikam

వ్యవసాయ కార్మికులకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలి;తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News