Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:17 PM

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా జల్లెల పెంటయ్య

22-05-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా జల్లెల పెంటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల రామన్నపేటలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభల్లో ప్రతినిధులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన జల్లెల పెంటయ్య నిరుపేద గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించారు. ఐడియల్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తూ సీఐటీయూ యూనియన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో సీపీఎం పార్టీ సభ్యత్వం పొంది, రామన్నపేట, నకిరేకల్ డివిజన్ కమిటీ సభ్యుడిగా, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శిగా సేవలందించారు.

అలాగే గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా, 2006 నుంచి 2022 వరకు సీపీఎం మండల కార్యదర్శిగా పనిచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లా కమిటీ సభ్యుడిగా, చౌటుపల్‌లో జరిగిన జిల్లా మహాసభల్లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.మండల వ్యాప్తంగా కూలీల సమస్యలు, భూమి పోరాటాలకు సారథ్యం వహించిన ఆయన అర్హులైన పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు దక్కేలా అనేక ఉద్యమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జల్లెల పెంటయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు.

Sthanikam

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా జల్లెల పెంటయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News