Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:49 PM

వట్టి వారి గూడెంలో పశువుల ఫెర్టిలిటీ శిబిరం 50 పశువులకు గర్భకోశ పరీక్షలు – 25 దూడలకు నట్టల నివారణ మందులు

27-02-2026 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఫిబ్రవరి 27: సర్నేని గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని వట్టి వారి గూడెం ఆవాస గ్రామంలో శుక్రవారం పశువుల ఫెర్టిలిటీ, గర్భకోశ వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ గంగాదేవి స్వామి శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గేదెలు, ఆవుల్లో వచ్చే గర్భకోశ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స చేయిస్తే రైతులకు ఆర్థిక నష్టం తగ్గుతుందని సూచించారు. పశుసంవర్థక రంగంలో అవగాహన పెంపు అవసరమని పేర్కొన్నారు.

శిబిరంలో 35 గేదెలు, 15 ఆవులకు గర్భకోశ పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించారు. 25 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. అంతర పరానా జీవుల నివారణకు కూడా పశువులకు మందులు అందించారు.

కార్యక్రమంలో పశువైద్యాధికారిణి డాక్టర్ జోత్స్న, వీఎల్‌ఓ సుభాషిణి, రాజేందర్, మల్లేష్, సురేష్ (గోపాల మిత్రులు), శ్రీను సూపర్వైజర్, రైతులు వట్టి రవీందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు శిబిరానికి మంచి స్పందన తెలిపారు.

Sthanikam

వట్టి వారి గూడెంలో పశువుల ఫెర్టిలిటీ శిబిరం 50 పశువులకు గర్భకోశ పరీక్షలు – 25 దూడలకు నట్టల నివారణ మందులు

Article Image

రామన్నపేట, ఫిబ్రవరి 27: సర్నేని గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని వట్టి వారి గూడెం ఆవాస గ్రామంలో శుక్రవారం పశువుల ఫెర్టిలిటీ, గర్భకోశ వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ గంగాదేవి స్వామి శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గేదెలు, ఆవుల్లో వచ్చే గర్భకోశ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స చేయిస్తే రైతులకు ఆర్థిక నష్టం తగ్గుతుందని సూచించారు. పశుసంవర్థక రంగంలో అవగాహన పెంపు అవసరమని పేర్కొన్నారు.

శిబిరంలో 35 గేదెలు, 15 ఆవులకు గర్భకోశ పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించారు. 25 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. అంతర పరానా జీవుల నివారణకు కూడా పశువులకు మందులు అందించారు.

కార్యక్రమంలో పశువైద్యాధికారిణి డాక్టర్ జోత్స్న, వీఎల్‌ఓ సుభాషిణి, రాజేందర్, మల్లేష్, సురేష్ (గోపాల మిత్రులు), శ్రీను సూపర్వైజర్, రైతులు వట్టి రవీందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు శిబిరానికి మంచి స్పందన తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News