సూర్యాపేట స్థానికం జిల్లా ప్రతినిధి బిక్షం
సూర్యాపేట పిల్లలమరి శివాలయంలో
వసంత పంచమి శుక్రవారం సందర్భంగా చారిత్రాత్మకమైన మన పిల్లలమరి శివాలయంలో శ్రీ సరస్వతి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో వేయించేసి ఉన్న శ్రీ సరస్వతి అమ్మవారికి అభిషేకం, అనంతరం నూతన వస్త్రాలంకరణ చేశారు.
అలాగే శ్రీ చక్ర దేవతకు విశేష పూజలు నిర్వహించగా, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ చేశారు. సరస్వతి పూజ అనంతరం అమ్మవారిని విశేష అలంకరణలో దర్శనానికి ఉంచగా, భక్తులు అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని తరించారు.
విద్య, జ్ఞానం, కళల అభివృద్ధికి అమ్మవారి కృప కలగాలని భక్తులు ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణతో, భక్తి వాతావరణంతో కళకళలాడింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి