Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

వరి పంటలో అగ్గి తెగులు నివారణపై రైతులకు అవగాహన: ఏవో బి.శివశంకర్

09-03-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలను వ్యవసాయ అధికారి (ఏవో) బి.శివశంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పండించే రైతులు పంటపై వచ్చే తెగుళ్లు, పురుగుల తీవ్రతను తరచూ పరిశీలిస్తూ పంట పొలాల పరిసర పరిస్థితులను విశ్లేషించుకోవాలని సూచించారు.

ప్రస్తుతం చాట్రాయి మండలంలో వరి పంట దుబ్బు చేసే దశలో ఉందని తెలిపారు. ఈ దశలో సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పొలంలో సుమారు 5 సెంటీమీటర్ల నీటిమట్టం ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు.

ఉదయాన్నే మంచు ఎక్కువగా ఉండటం, పగటిపూట ఎండలు అధికంగా ఉండే పరిస్థితుల్లో వరి పంటకు అగ్గి తెగులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ తెగులు సోకినప్పుడు వరి ఆకులపై వెన్ను మెడ భాగంలో దారపు కండెల ఆకారంలో మచ్చలు కనిపిస్తాయని, మచ్చల అంచుల్లో గోధుమ రంగు ఉండి మధ్యలో బూడిద రంగులో ఉంటాయని వివరించారు. అలాగే కణుపులు నల్లగా మారి కణుపు వద్ద మొక్క విరిగి పడిపోతుందని చెప్పారు.

తెగులు సోకిన పొలాల్లో శీలింద్ర మందులను పిచికారి చేయాలని సూచించారు. ట్రైసైక్లోజోల్ 75 శాతం మందును ఒక లీటర్ నీటికి 0.6 గ్రాములు లేదా ఇసోప్రోతిలిన్ 40 శాతం మందును ఒక లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 3 శాతం మందును ఒక లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేస్తే అగ్గి తెగులును నియంత్రించవచ్చని వ్యవసాయ అధికారి బి.శివశంకర్ రైతులకు సూచించారు.

Sthanikam

వరి పంటలో అగ్గి తెగులు నివారణపై రైతులకు అవగాహన: ఏవో బి.శివశంకర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News