Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

08-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్,అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో రోడ్డు భద్రతా మాసం సందర్భంగా గురువారం విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యతనని విద్యార్థులకు గుర్తు చేశారు. చిన్న వయసు నుంచే రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకోవడం అత్యంత అవసరమని అధికారులు చెప్పారు.కోహిర్ ఎస్ఐ నరేష్ రోడ్డు ప్రమాదాల ప్రధాన కారణాలు,నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, అధిక వేగంతో నడపడం,హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకపోవడం వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం వల్ల ప్రమాదాలను ఎక్కువ మేరకు నివారించవచ్చని సూచించారు.డెక్కన్ టోల్ ప్లాజా సేఫ్టీ మేనేజర్ నాగరాజు పాదచారులుగా రోడ్డు మీద నడిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జీబ్రా క్రాసింగ్ సక్రమంగా ఉపయోగించడం, రాత్రివేళల్లో రిఫ్లెక్టర్ల ప్రాముఖ్యత వంటి విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.విద్యార్థులు నేర్చుకున్న రోడ్డు భద్రత నియమాలను తమ కుటుంబ సభ్యులు,గ్రామస్తుల మధ్య పంచుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, డెక్కన్ టోల్ ప్లాజా సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకుని, భవిష్యత్తులో సురక్షితంగా రోడ్డు ఉపయోగించే విధానాలపై శ్రద్ధ చూపేలా మారేందుకు ప్రయత్నించబడ్డారు.

Sthanikam

విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News