Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:05 AM

వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

09-03-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆరవ వార్డు సభ్యుడు చిలుముల సునీల్ రెడ్డి, గిరి నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు బి. ప్రణీత్ నాయక్ తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరి నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వార్డు ప్రజలు అవసరమైన వారు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల ఆదేశాల మేరకు ఈ వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో సూర్యాపేట సాధారణ ఆసుపత్రికి చెందిన వైద్యులు ఎముకల వ్యాధులు, సాధారణ వైద్యం, కంటి పరీక్షలు, మహిళల వైద్యం, చిన్నపిల్లల వైద్యం వంటి విభాగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.

శిబిరానికి వచ్చిన రోగులకు రక్తపోటు, చక్కెర స్థాయిలు వంటి అవసరమైన పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను

అందజేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వెంకటేష్, సమీరా, శ్రీకాంత్ వర్మ, పర్యవేక్షకులు రమణ, ఏకస్వామి, నర్సింగ్ అధికారి భాగ్యలక్ష్మి, మందుల విభాగం అధికారి మధు, ప్రయోగశాల సిబ్బంది భార్గవి, ఆరోగ్య కార్యకర్తలు విజయ, సువర్ణ, చిలుకమ్మ, కరుణ, సుశీల, కవిత, శాంత, ఆశ కార్యకర్తలు బైనాభి, ఫర్విన్, శైలజ, ఉమా, రజిత, సావిత్రి, సునీత, పారిజాతం, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News