Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:06 AM

వైద్య ఆరోగ్యశాఖలో 18 వేల ఉద్యోగాల భర్తీ – త్వరలో ఏఎన్ఎం, నర్సింగ్ ఆఫీసర్ల ఫలితాలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

06-05-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని బాలసదనంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా పాల్గొని బాలసదనం నూతన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో సుమారు 18 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని, మల్టీపర్పస్ ఏఎన్ఎంలు మరియు నర్సింగ్ ఆఫీసర్ల ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్యం, మహిళా సాధికారత, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలు, శిశువులు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, బాలసదనాలు మరియు అంగన్వాడీల అభివృద్ధిని ప్రభుత్వ నిధులు, సిఎస్ఆర్ నిధులతో చేపడతామని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణం, ఖాళీ ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలను మంత్రి అభినందించారు. అనంతరం బాలసదనం బాలికలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని తక్షణమే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వికలాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్, సబ్ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, మున్సిపల్ కమిషనర్ ప్రశాంత్, సీడీపీఓ సుజాత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వైద్య ఆరోగ్యశాఖలో 18 వేల ఉద్యోగాల భర్తీ – త్వరలో ఏఎన్ఎం, నర్సింగ్ ఆఫీసర్ల ఫలితాలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News