Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:07 AM

వైభవంగా స్వయంభు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు – పులిమామిడి రాజు

05-05-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలోని వెంకటాపూర్ గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ పద్మావతి సమేత అద్భుత వెంకటేశ్వర స్వామి చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజును ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. మే 5 నుండి 8 వరకు బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 7 గురువారం ఉదయం 11 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం, సాయంత్రం 4 గంటలకు సదాశివపేట పట్టణం నుండి వెంకటాపూర్ ఆలయం వరకు స్వామివారి దివ్య విమాన రథోత్సవం ఘనంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అధ్యక్షులు చిల్వేరి వెంకటేశం కోరారు. ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని, బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పండల జగదీశ్వర్ పంతులు, షోలాపురం రాజు, తాటికొండ నాగనాథ్, సుధాకర్, మల్లారెడ్డి, భాస్కర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వైభవంగా స్వయంభు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు – పులిమామిడి రాజు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News