Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 11:29 PM

వెనుజులాపై అమెరికా దుర్మార్గ దాడులు తక్షణమే నిలిపివేయాలి

వెనుజులాపై అమెరికా దుర్మార్గ దాడులు తక్షణమే నిలిపివేయాలి

వెనుజులాపై అమెరికా దుర్మార్గ దాడులు తక్షణమే నిలిపివేయాలి
January 04, 2026 03:43 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం – వరికుప్పల వెంకన్న

సూర్యపేట స్థానికం ప్రతినిధి బిక్షం

వెనుజులా దేశంపై అమెరికా చేపడుతున్న దుర్మార్గమైన, నేరపూరిత సైనిక దాడులను మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఐక్య) సూర్యాపేట జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ జాతీయ కమిటీ సభ్యులు వరికుప్పల వెంకన్న, జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ ఒక ప్రకటనలో తెలిపారు.

వెనుజులా దేశంలోని కారకాస్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోని పౌర, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా జరుపుతున్న సైనిక దాడులు అత్యంత అమానుషమని వారు పేర్కొన్నారు. ఇవి అన్ని రకాల అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల సూత్రాలను ఉల్లంఘించడమేనని అన్నారు.

అమెరికా ఐక్యరాజ్యసమితి నియమావళి, భద్రతామండలి నిబంధనలను తుంగలో తొక్కుతూ ఏకపక్ష దాడులకు దిగడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలను పూర్తిగా ధిక్కరిస్తోందని విమర్శించారు. గత కొన్ని నెలలుగా వెనుజులా సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన సైనిక, నౌకాదళ బలగాలను మోహరించడం ప్రపంచ దేశాల అభిశంసనకు గురవుతున్నప్పటికీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వానికి తీవ్ర ముప్పుగా మారిందని తెలిపారు.

స్వయం ప్రతిపత్తి, స్వయం పోషక విధానాలతో ముందుకు సాగుతున్న దేశాలపై ఆర్థిక, సైనిక దాడులు చేయడం ద్వారా వాటి ఆర్థిక వ్యవస్థలను కుదేల్ చేయాలనే అమెరికా సామ్రాజ్యవాద విధానాలు అత్యంత దుర్మార్గమైనవని పేర్కొన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాంతికాముకులు, ప్రజాస్వామ్యవాదులు స్పందించాలని పిలుపునిచ్చారు.

అమెరికా యుద్ధోన్మాద దుష్ట చర్యలను భారత ప్రభుత్వం గట్టిగా ఖండించి, వ్యతిరేకించాలని యంసిపిఐ (యు) పార్టీ డిమాండ్ చేస్తోందని ఈ ప్రకటనలో వరికుప్పల వెంకన్న, షేక్ నజీర్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News