Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన ప్రభుత్వ ఉద్యోగి

28-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్‌ఫండ్ ఏజెంట్లు, అధిక వడ్డీల ఒత్తిడితో ఏఈఓ ఆత్మహత్య.. ఉరుమడ్లలో విషాదం.

ఉరుమడ్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వడ్డీ వ్యాపారులు, చిట్‌ఫండ్ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ (ఏఈఓ)గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి గుంటోజు బాలరాజు (38) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలరాజు ప్రస్తుతం కేతపల్లి మండలంలో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలం క్రితం వ్యక్తిగత అవసరాల కోసం కొందరు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకున్నాడు. అయితే, అప్పు ఇచ్చిన వారు అధిక వడ్డీలు వేస్తూ, ఖాళీ చెక్కులు మరియు ప్రామిసరీ నోట్లపై ముందుగానే సంతకాలు తీసుకున్నట్లు సమాచారం.గత కొంతకాలంగా డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులు, చిట్‌ఫండ్ ఏజెంట్లు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తూ బాలరాజును మానసికంగా వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన బాలరాజు తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.మృతుడికి భార్య పద్మ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుని భార్య గుంటోజు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన ప్రభుత్వ ఉద్యోగి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News