Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:04 AM

ఉపాధి హామీ పనులపై కేంద్ర బృందానికి సమగ్ర వివరణ

26-02-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రజెంటేషన్ ద్వారా వివరించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ఈజీఎస్ పనుల ఫోటో ప్రదర్శన తిలకించిన కేంద్ర ప్రతినిధులు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం విబి గ్రామ్గాగా మారుస్తున్న నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ బృందం జిల్లాలో పర్యటిస్తోంది. కేంద్ర బృందం సభ్యులు సంజయ్ కుమార్ నేతృత్వంలో 26-02-2026 నుండి 28-02-2026 వరకు సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో సమావేశమయ్యారు. జిల్లాలో అమలు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై కలెక్టర్ సమగ్రంగా వివరించారు. ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతి, ఖర్చులు, లబ్ధిదారుల సంఖ్య, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలను వివరించారు. జిల్లాలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌లు, గ్రామ రహదారులు, పచ్చదనం పెంపు కార్యక్రమాలు, మట్టి పనులు వంటి అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈజీఎస్ పనుల ఫోటో ప్రదర్శనను కేంద్ర బృందం సభ్యులు, కలెక్టర్ తిలకించారు. ఫోటోల ద్వారా జిల్లాలో అమలు చేసిన పనుల వైవిధ్యం, నాణ్యతను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ఉప ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శిరీష, కేంద్ర బృందం సభ్యులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ పనులపై కేంద్ర బృందానికి సమగ్ర వివరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News