ఉపాధి హామీ పనుల్లో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించండి
ఉపాధి హామీ పనుల్లో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించండి
Anjali
రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల్లో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు జరపాలని బుధవారం పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండల కేంద్రంలో గ్రామ సచివాలయం చెర్లోపల్లి, గ్రామ సచివాలయం జానకంపల్లి, లోచర్ల గ్రామ సచివాలయం దగ్గర నిరసనలు తెలపడం జరిగింది. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వెంకటేష్ మాట్లాడుతూ గ్రామాల్లో నివసిస్తున్న చిన్న కారు రైతులు కూలీలు పెరుగుతున్న యంద్రీకరణ వల్ల గ్రామాల్లో కూలీలకు పనులు దొరక్క కుటుంబాలను పోషించుకొనుటకు అనేకమంది గ్రామాల నుండి పట్టణాలకు వలసలు వెళ్లే పరిస్థితి ఉండేది ఈ వలసలు ఆపడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది కొంతకాలం గ్రామాల్లో నివసించే కూలీలకు ఉపాధి పథకం బాగా ఉపయోగం పడడం వల్ల వలసలు ఆగాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పాత చట్టాన్ని సవరించి విబి రామ్ జి పేరు తెచ్చి పేదల పొట్టు కొట్టేలా ఉంది గాంధీ పేరుతో ఉన్న చట్టాన్ని పేరు మార్చి 125 రోజులకు పెంచుతామని గొప్పలు చెప్పినా ప్రభుత్వం రోజులు పెంచింది కానీ భారీగా నిధులు తగ్గించి గత చట్టంలో ఉన్న గ్యారెంటీని రద్దు చేసింది కేంద్రం ప్రతి ఏడాది 90% అంటే 9,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 10% అంటే 1000 కోట్లు మన రాష్ట్రానికి కేటాయించింది కొత్త చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 40% అంటే 4వేల కోట్లు కేటాయిస్తే కేంద్రం 6000 కోట్లు ఇస్తామని చెప్పింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధి హామీకి ఇవ్వడానికి 4000 కోట్లు మా దగ్గర లేవని అంటున్నాడు ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీలను పూర్తిగా దగా చేసే పద్ధతుల్లో మాట్లాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ రాబోయే కాలంలో కూలీల తరఫున నిలబడి దశలవారీగా పోరాటాలు నిర్మిస్తామని తెలియజేయడం జరిగింది.డిమాండ్స్
1) ఉపాధి హామీకి మన రాష్ట్రానికి పదివేల కోట్లు కేంద్రం నిధులు కేటాయించాలి
2) సమ్మర్ అలవెన్స్ కొనసాగించాలి మంచి నీళ్లు మజ్జిగ సౌకర్యం కల్పించాలి
3) 30 రోజులు పని చేసినా ప్రతి కుటుంబానికి పనిముట్లు ప్రతి గ్రూపు కి టెంటు మెడికల్ కిట్టు ఇవ్వాలి
4) ఉపాధి వేతన దారులు ప్రమాదంలో మరణిస్తే 10 లక్షలు ఎక్స్ గ్రేసియా ఇవ్వాలి
5) పేస్ యాప్ రద్దు చేయాలి రెండు పూటలా పని పద్ధతి రద్దు చేయాలి
6) కుటుంబానికి 200 రోజులు పని రోజులకి 700 రూపాయలు వేతనం ఇవ్వాలి అవినీతిని అరికట్టాలి
7) పని ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న వారికి పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, ఉపాధి కూలీలు కొండయ్య, లక్ష్మమ్మ, నారాయణ, సరోజమ్మ కాంతమ్మ, సురేష్, వెంకట లక్ష్మమ్మ, శోభారాణి, రమేష్,చంద్రకళమ్మ, వెంకటేష్, లక్ష్మీనరసమ్మ, సుధాకర్,భారతి తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి