Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:21 AM

ఉన్న ఊరు కన్నతల్లితో సమానం..! జనగణనలో స్వగ్రామ చిరునామా నమోదు చేయాలి : సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

09-05-2026 151 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామ అభివృద్ధి ప్రతి గ్రామస్తుడి బాధ్యత

ఉన్న ఊరు కన్నతల్లితో సమానం.. గ్రామ అభివృద్ధి ప్రతి గ్రామస్తుడి బాధ్యత” అని వెల్లంకి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ పేర్కొన్నారు. 2026 జనగణన నేపథ్యంలో గ్రామ ప్రజలకు ఆయన ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.

గ్రామ జనాభా ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి నిధులు కేటాయిస్తాయని తెలిపారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య తదితర కారణాలతో ఇతర పట్టణాల్లో నివసిస్తున్న గ్రామస్తులు అక్కడి చిరునామాలను జనగణనలో నమోదు చేయడం వల్ల గ్రామానికి రావాల్సిన నిధుల్లో కోత పడే అవకాశం ఉందన్నారు.

అందువల్ల ఆన్‌లైన్ లేదా ప్రత్యక్షంగా జనగణనలో పాల్గొనేటప్పుడు తమ స్వగ్రామం వెల్లంకి అని నమోదు చేయించాలని కోరారు. ఇలా చేయడం ద్వారా గ్రామానికి మరిన్ని అభివృద్ధి నిధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.

గ్రామాభివృద్ధి కోసం ప్రతి గ్రామస్తుడు బాధ్యతగా వ్యవహరించి జనగణనలో సహకరించాలని సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఉన్న ఊరు కన్నతల్లితో సమానం..! జనగణనలో స్వగ్రామ చిరునామా నమోదు చేయాలి : సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

Article Image

గ్రామ అభివృద్ధి ప్రతి గ్రామస్తుడి బాధ్యత

ఉన్న ఊరు కన్నతల్లితో సమానం.. గ్రామ అభివృద్ధి ప్రతి గ్రామస్తుడి బాధ్యత” అని వెల్లంకి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ పేర్కొన్నారు. 2026 జనగణన నేపథ్యంలో గ్రామ ప్రజలకు ఆయన ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.

గ్రామ జనాభా ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి నిధులు కేటాయిస్తాయని తెలిపారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య తదితర కారణాలతో ఇతర పట్టణాల్లో నివసిస్తున్న గ్రామస్తులు అక్కడి చిరునామాలను జనగణనలో నమోదు చేయడం వల్ల గ్రామానికి రావాల్సిన నిధుల్లో కోత పడే అవకాశం ఉందన్నారు.

అందువల్ల ఆన్‌లైన్ లేదా ప్రత్యక్షంగా జనగణనలో పాల్గొనేటప్పుడు తమ స్వగ్రామం వెల్లంకి అని నమోదు చేయించాలని కోరారు. ఇలా చేయడం ద్వారా గ్రామానికి మరిన్ని అభివృద్ధి నిధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.

గ్రామాభివృద్ధి కోసం ప్రతి గ్రామస్తుడు బాధ్యతగా వ్యవహరించి జనగణనలో సహకరించాలని సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News