Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతే లక్ష్యం.. నరసింహపురం అభివృద్ధికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ వినూత్న అడుగు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 05:28 AM

ఉద్యాన సాగు వృద్ధే లక్ష్యం,జిల్లాలో 10 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక డి.ఆర్.డి.ఏ ద్వారా రుణాలు పాత్రికేయులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్

30-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

విజయనగరం: జిల్లాలో ఉద్యాన సాగుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా రైతుల్ని ప్రోత్సహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు.వరి పంట కంటే ఎక్కువ లాభం ఉద్యాన వనాల ద్వారా అందుతుందని,అందుకోసం జిల్లాలో 10 వేళా ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళిక రచించామని తెలిపారు.శుక్రవారం జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ అనంతరం కలెక్టర్ మీడియా వారితో మాట్లాడారు.జిల్లాలో 696 రెవిన్యూ గ్రామాల్లో ఆదర్శ రైతుల్ని గుర్తించామని,వచ్చే ఖరీఫ్ నాటికి 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల కోసం ప్రణాళిక వేయడం జరిగిందన్నారు.స్వయం సహాయక సభ్యుల ద్వారా 5గురును గ్రూప్ గా చేసి స్త్రీ నిధి రుణాలను తక్కువ వడ్డీకే మంజూరు చేసి బోర్ వెల్స్ ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.5 ఎకరాల విస్తీర్ణంలో రైతుల ఎంపిక మేరకు ప్రకృతి వ్యవసాయానికి కూడా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.

రైతులు పండించిన కూరగాయలు,ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందని అన్నారు.విజయనగరం, విశాఖపట్నంలలో నున్న రైతు బజార్లకు వీరిని ట్యాగ్ చేయడం జరుగుతుందని,ప్రైవేట్ వర్తకులతో కూడా మాట్లాడడం జరుగుతుందన్నారు.ఆయిల్ పామ్ వలన కూడా లాభాలు వస్తాయని,నాలుగేళ్లలో చేతికి అధిక లాభాలు వస్తాయని,ఈ లోపల అంతర్ పంటలను కూడా వేసుకోవచ్చు నని పేర్కొన్నారు.జిల్లాలో సంప్రదాయ పంటల నుండి రైతును మళ్లించి వాణిజ్య పంటల దిశగా తీసుకువచ్చి, రైతుకు అధిక ఆదాయం సమకూర్చే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.

Sthanikam

ఉద్యాన సాగు వృద్ధే లక్ష్యం,జిల్లాలో 10 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక డి.ఆర్.డి.ఏ ద్వారా రుణాలు పాత్రికేయులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్

Article Image

విజయనగరం: జిల్లాలో ఉద్యాన సాగుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా రైతుల్ని ప్రోత్సహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు.వరి పంట కంటే ఎక్కువ లాభం ఉద్యాన వనాల ద్వారా అందుతుందని,అందుకోసం జిల్లాలో 10 వేళా ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళిక రచించామని తెలిపారు.శుక్రవారం జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ అనంతరం కలెక్టర్ మీడియా వారితో మాట్లాడారు.జిల్లాలో 696 రెవిన్యూ గ్రామాల్లో ఆదర్శ రైతుల్ని గుర్తించామని,వచ్చే ఖరీఫ్ నాటికి 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల కోసం ప్రణాళిక వేయడం జరిగిందన్నారు.స్వయం సహాయక సభ్యుల ద్వారా 5గురును గ్రూప్ గా చేసి స్త్రీ నిధి రుణాలను తక్కువ వడ్డీకే మంజూరు చేసి బోర్ వెల్స్ ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.5 ఎకరాల విస్తీర్ణంలో రైతుల ఎంపిక మేరకు ప్రకృతి వ్యవసాయానికి కూడా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.

రైతులు పండించిన కూరగాయలు,ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందని అన్నారు.విజయనగరం, విశాఖపట్నంలలో నున్న రైతు బజార్లకు వీరిని ట్యాగ్ చేయడం జరుగుతుందని,ప్రైవేట్ వర్తకులతో కూడా మాట్లాడడం జరుగుతుందన్నారు.ఆయిల్ పామ్ వలన కూడా లాభాలు వస్తాయని,నాలుగేళ్లలో చేతికి అధిక లాభాలు వస్తాయని,ఈ లోపల అంతర్ పంటలను కూడా వేసుకోవచ్చు నని పేర్కొన్నారు.జిల్లాలో సంప్రదాయ పంటల నుండి రైతును మళ్లించి వాణిజ్య పంటల దిశగా తీసుకువచ్చి, రైతుకు అధిక ఆదాయం సమకూర్చే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News