Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:00 AM

ఉండ్రుగొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఉండ్రుగొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఉండ్రుగొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం
06-03-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సీసీ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలోని ఉండ్రుగొండ గ్రామంలో అభివృద్ధి పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. గ్రామంలో నిర్మించనున్న సీసీ రహదారి పనులకు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామ గ్రామంలో సీసీ రహదారులు, కాలువల నిర్మాణాలు చేపడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడిసె రామకృష్ణ, పిసిసి ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ చింతమల్ల రమేష్, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

ఉండ్రుగొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News