ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
Biksham
మన్సూరాబాద్ హిమపురి కాలనీ రోడ్ నెంబర్–2లోని గణేష్ మండపంలో జనహిత చారిటబుల్ ట్రస్ట్, శ్రీ సరిత గ్రూప్ ఆఫ్ క్లినిక్స్, క్లోవ్ డెంటల్, మాక్స్ విజన్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ఆదివారం విశేష స్పందన లభించింది. శిబిరంలో 70 నుంచి 100 మందికి పైగా ప్రజలు పాల్గొని వైద్య సేవలు పొందారు.
ఈ సందర్భంగా సరిత క్లినిక్స్ మేనేజింగ్ డైరెక్టర్, జనహిత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ శిబిరంలో పాల్గొన్న వారికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సీఎన్ న్యూట్రిషన్ సెంటర్ సహకారంతో అధిక బరువుతో బాధపడుతున్న వారికి ప్రత్యేక సలహాలు, సూచనలు అందించినట్లు పేర్కొన్నారు.
అలాగే తమ సంస్థలో గైనకాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల్లో అపార అనుభవం కలిగిన ప్రభుత్వ విశ్రాంత వైద్యుల సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ట్రస్ట్ లక్ష్యమని వెల్లడించారు. ఆరోగ్య బీమా పథకాలపై అవగాహన, సలహాల కోసం కూడా ప్రజలు తమను సంప్రదించవచ్చని సూచించారు.
ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఆదివారం మన్సూరాబాద్‌లోని వివిధ కాలనీల కమ్యూనిటీ హాళ్లలో శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ హైమావతి, ఆర్థోపెడిక్ వైద్యురాలు డాక్టర్ రూబీ జోక్సన్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి