Sthanikam - Truth Matters
Logo

త్రాగునీటి సరఫరా పనులకుశంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Updated : 17 Jan 2026 15:50 IST
As Preferred Source 1 min read
త్రాగునీటి సరఫరా పనులకుశంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నల్లగొండ పట్టణం 34వ వార్డులో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మంచి నీటి సరఫరా అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. పట్టణ పరిధిలో ప్రతి ఇంటికి నిరంతర నీటి సరఫరా లక్ష్యంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నల్లగొండ పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులన్నింటినీ దశలవారీగా మెరుగుపరుస్తామని చెప్పారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న ఈ నీటి సరఫరా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, స్థానికుల దైనందిన జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, వార్డు వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

త్రాగునీటి సరఫరా పనులకుశంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Article Image

నల్గొండ స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నల్లగొండ పట్టణం 34వ వార్డులో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మంచి నీటి సరఫరా అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. పట్టణ పరిధిలో ప్రతి ఇంటికి నిరంతర నీటి సరఫరా లక్ష్యంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నల్లగొండ పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులన్నింటినీ దశలవారీగా మెరుగుపరుస్తామని చెప్పారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న ఈ నీటి సరఫరా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, స్థానికుల దైనందిన జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, వార్డు వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news